‘కాపు గర్జన’ ఘటన ఫై పవన్ స్పందన…

Pawan-Kalyan-(13)కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన కాపుగర్జన సభ.. ఊహించని రీతిలో ఉద్యమరూపం దాల్చి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన సంగతి తెలిసిందే…ఈ సందర్భంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ ఈరోజు సాయింత్రం తన జనసేన పార్టీ ఆఫీసు లో ప్రెస్ మీట్ ఏర్పాటుచేయడం జరిగింది..

ఆయన మాట్లాడుతూ..”తుని లో జరిగిన సంఘటన ఎంతో బాధ కలిగించిందని, ఏదయినా ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకరావడం లో తప్పులేదు కానీ ఇలా ప్రభుత్వ ఆస్థిని ద్వసం చేయడం అనేది బాదాకరం అన్నారు…నిన్న జరిగింది ఓ రకంగా చూస్తే ప్రణాళిక ప్రకారం జరిగిఉంటుందని అనిపిస్తుంది అన్నారు..

*అలాగే ఒక సభ జరుగుతుంది అని తెలిసినప్పుడు ప్రభుత్వం కూడా తగు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు..

* ఉద్యమం నడిపే నాయకుడు బాధ్యతగా వ్యవహరించాలి తప్ప ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకోడదు..

* ప్రస్తుతం ఉన్న బిసిలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేసాడు..

*తానూ ఎప్పుడు ఓ కులం కోసం పోరాటం చేయనని , జాతి సమగ్రతను కాపాడాలని పోరాటం చేస్తున్నాని చెప్పాడు..

* అలాగే రోహిత్ మరణం చాల బాధ కలిగించిందని , యూనివర్సిటీ లలో కుల వ్యవస్థ ఎప్పటినుండో ఉందని , తాను చదవు కునే రోజుల్లో ఇలాంటివి చూశానని తెలిపాడు…