తెరాస కు జనసేన సపోర్ట్ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ముందస్తు ఎన్నికలకు తెరాస పార్టీ కి సపోర్ట్ ఇస్తున్నాడా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తుందని గతంలో ప్రకటించిన పవన్ , ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది. సడెన్ గా తెలంగాణ రాష్ట్రం లో ఎన్నికల తేదీ ప్రకటన రావడం తో , ఇప్పుడిప్పుడే ఆంధ్ర లో జనసేన కు బలం పెరుగుతుంది. ఈ టైం లో ఎలాంటి ప్రచారం లేకుండా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి అబాసుపాలవడం కంటే పోటీ నుండి తప్పుకోవడం మంచిదనే నిర్ణయానికి పవన్ వచ్చినట్లు తెలుస్తుంది.

ముందునుండి కూడా జనసేన కు తెలంగాణలో సరైన సంస్థాగత నిర్మాణం లేదు. ఉన్న కొద్దిపాటి క్యాడర్ కు దిశా నిర్దేశం చేసే న్యాయకత్వం లేదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ ఎన్నికలకు సిద్దమవడం సాధ్యంకాని పని. ఒకవేళ పోటీ చేసిన ఓటమి తప్పదు. ఈ ఓటమి ఫలితం రాబోయే, ప్రధాన లక్ష్యమైన ఏపీ ఎన్నికలపై ఖచ్చితంగా పడుతుంది. అందుకే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయం పట్ల తెలంగాణ జనసేన నేతలు, కార్య కర్తలు కాస్త ఫీల్ అవుతున్నారు. మరోపక్క మహాకూటమి సైతం పవన్ ను సంప్రదించారని , కానీ పవన్ వారికీ నో చెప్పినట్లు వినికిడి. నాలుగేళ్ల లో తెలంగాణ ను బంగారు తెలంగాణ చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఫై నమ్మకం ఉంది..మరోసారి ఆయన వస్తే బాగుంటుందని చెప్పినట్లు రాజకీయ వర్గాలు చెపుతున్నాయి.