తెరాస అభ్యర్ది కి పవన్ కళ్యాణ్ మద్దతు..?

Pawan-Support-TRS-Partyతెలంగాణా రాష్ట్రం లో మళ్లీ రాజకీయాలు వేడి ఎక్కాయి..వరంగల్ ఉప ఎన్నికల్లో నువ్వా , నేనా అనట్లు అన్ని రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి…అగ్నికి ఆహుతి తోడయినట్లు తెలంగాణా లో రాజకీయాలు వేడి వేడి గా సాగుతుంటే , పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పూర్తి స్థాయి పార్టీగా రిజిస్టర్ జరగడం తో ఇంకాస్త హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఈ ఉప ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటాడా..లేక ఏదయినా పార్టీ కి మద్దతు ఇస్తాడా అనే ఉహాగానాలు అందరిలో కలుగుతున్నాయి..

మరోపక్క పవన్ కళ్యాణ్ తెలంగాణా అభ్యర్ది కి మద్దతు ఇస్తాడనే ప్రచారం జోరుగా చేస్తున్నారు..ఒకవేళ నిజంగానే తెరాస కు పవన్ మద్దతు ఇస్తాడా..? అలా ఇస్తే తెలుగు దేశం పార్టీ ఏమి కావాలి..గత ఎన్నికల్లో పవన్ ఆ పార్టీ కి మద్దతు ఇచ్చి ఆంధ్ర లో టీడీపీ అధికారంలోకి రావడంలో ముఖ్యపాత్ర పోషించిన పవన్ తెరాస కు ఎలా మద్దతు ఇస్తాడు అని తెలుగు తమ్ములు అంటున్నారు..మొత్తానికి జనసేన రిజిస్టర్ కాస్త అన్ని పార్టీ లకు గుబులు పుట్టిస్తుంది..