రాష్ట్రపతికి పయ్యావుల లేఖ!

Payyavula-Keshavరాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. రాష్ట్రాల సంప్రదింపుల మేరకు విభజన చేయాలని రాజ్యాంగంలో పేర్కొన్నారని పయ్యావుల లేఖ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పయ్యావుల వెల్లడించారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన ప్రక్రియ పూర్తికాదని, విభజన ప్రక్రియ శాసనసభలోనే ప్రారంభం కావాలని రాజ్యాంగంలో చెప్పారని పయ్యావుల చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పటికే పయ్యావుల తీరుపై తెదేపా తెలంగాణ నేతలు గుర్రుగా వున్నట్లు తెలుస్తోంది. మరీ.. తాజా పయ్యావుల లేఖపై వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.. !