కాంగ్రెస్ కు మరో షాక్!

perni naniకాంగ్రెస్ పార్టీ నుండి వైకాపాలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా  ప్రభుత్వ విప్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని వెంకటేశ్వర్లు (నాని) జైల్లో ఉన్న జగన్ ను ఈరోజు (గురువారం) ఉదయం పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ… కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని.. కష్టకాలంలో వైఎస్ ఆర్ కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మచిలీపట్నం నియోజవర్గ ప్రజలు, వైఎస్ ఆర్ అభిమానుల అభీష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాని తెలిపారు. ప్రభుత్వ విప్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.