కరోనా ఎఫెక్ట్ : హోలీ వేడుకలకి ప్రధాని దూరం

ప్రపంచ దేశాలని వణికిస్తోన్న కరోనా వైరస్ పట్ల భారత్ అప్రమత్తయింది. ముందుగా ఈ వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు సామూహిక సమావేశాలు తక్కువగా చేయాలని ప్రపంచ దేశాలు సూచిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది హోలీ వేడుకల్లో పాల్గొనడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. ఒకే ప్రదేశంలో వేలాది మంది సామూహికంగా హోలీ వేడుకలను నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ యేడాది హోలీ పండగలో పాల్గొన కూడదని ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నిర్ణయం సరైందనేనని.. తాము ఈ యేడాది హోలీ పండగకి దూరంగా ఉంటామని పలువురు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.