పోలీస్ రిపోర్టులో అక్భర్ లీలలు!

akbaruddin Owaisiఆదిలాబాద్ జిల్లా నిర్మల్ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అరెస్టయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై ఉచ్చు నానాటికీ బిగుస్తుంది. మత వైషమ్యాలు రెచ్చగొట్టటం, రాజద్రోహం కేసులు అక్బరుపై నమోదైన విషయం తెలిసిందే. ఐదు రోజుల పోలీసు కస్టడీ ఉన్నప్పటికీ నాలుగు రోజుల్లోనే పోలీసులు విచారణను పూర్తి చేసి బుధవారం తెల్లవారుజామునే మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచి తిరిగి జైలుకు తరలించారు. తమ విచారణలో వెల్లడైన విషయాలను కోర్టుకు సమర్పించారు.

విచారణకు సహకరించే ఉద్దేశం అక్భర్ కు లేదని పోలీసులు తమ రిపోర్టులో తెలిపారు. అతను పూటకో మాట మారుస్తున్నారని పేర్కొన్నారు. నిర్మల్ సభలో అక్భర్ చేసిన ప్రసంగం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వెల్లడించారు. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ వర్గాన్నిరెచ్చగొట్టేలా ఉందని తెలిపారు. అయితే, ఆ ప్రసంగ సమయంలో తననేదో ఆవహించిందన్న అక్భర్ ఆ ప్రసంగంలోని కొన్ని భాగాలు తన వాయిస్ కాదంటూ
చెప్పడంతో ఇప్పటికే ఆ సీడిలను వాయిస్ టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. తన ఆవేశపూరిత ప్రసంగానికి కొన్ని పుస్తకాలు చదవడం కూడా కారణమని ఆయన చెప్పారని పోలీసులు రిపోర్టు లో పేర్కొన్నారు. పోలీసు కస్టడీలో ఉన్న ఈ నాలుగు రోజుల్లో అక్బర్ పోలీసులకు తన లీలను చూపించారని తెలుస్తోంది. ఒకసారి ముక్కుతో, మరొకసారి పెదవి బిగించి ఇలా రకరకాలుగా వ్యవహరించారని రిపోర్టులో తెలియజేశారని సమాచారం.