రూ.5కోట్ల చెక్ అందుకున్న సింధు

sindhu
రియో ఒలింపిక్స్ లో రజతపతకం సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగమ్మాయి ,హైదరాబాదీ పీవీ సింధుకి తెలంగాణ ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయిల క్యాష్ ప్రైజ్ ప్రకటించిన సంగతి తెల్సిందే. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు మీదుగా ఐదు కోట్ల రూపాయిల చెక్ అందుకున్నారు సింధు .

సిఎం క్యాంపు ఆఫీసు లో కేసిఆర్ ను కలశారు సింధు. సింధుతో పాటు కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించి, రూ.5 కోట్ల చెక్ ను, పుల్లెల గోపీచంద్ కు కోటి రూపాయల చెక్ ను కేసీఆర్ అందజేశారు. అలాగే ఒలింపిక్స్ లో ప్రతిభ కనబర్చిన శ్రీకాంత్ కు రూ.25 లక్షలు, సింధు ఫిజియోథెరపిస్టు కిరణ్ కు రూ.25 లక్షల చెక్ లను అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేసిఆర్ .. పీవీ సింధు వంటి క్రీడా రత్నాలు తయారయ్యేలా క్రీడా విధానం రూపొందిస్తామని చెప్పారు.

ఈకార్యక్రమం అనంతరం గవర్నర్ నరసింహన్ ఆహ్వానం మేరకు రాజ్ భవన్ కు వెళ్ళారు సింధు. ఈ సందర్భంగా సింధు, గోపీచంద్ లకు గవర్నర్ దంపతులు సన్మానించారు.