కృష్ణయ్య మందుబాబుల పొట్టకొట్టేలా ఉన్నాడే.. !

ఎన్నికల టైం.. మందుబాబులకి పండగే. తాగినోడి తాగినంత. విత్ బిర్యానీ. పై ఖర్చులకీ డబ్బు కూడా. మందు బాబులు మస్త్ మజా చేసే టైమింది. ఐతే, ఇప్పుడు మందుబాబుల పొట్టకొట్టేలా వున్నాడు ఆర్. కృష్ణయ్య. తెలంగాణలో ఎన్నికలు పూర్తయ్యేవరకు మద్యం నిషేధించాలని కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో మద్యం పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెలపాటు రాష్ట్రంలో బీరు షాపులు, వైన్ షాపులు, బార్ షాపులు బంద్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ని సచివాలయంలో కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. మరీ.. కృష్ణయ్య డిమాండ్ పై ఎన్నికల సంఘం ఏవిధంగా స్పందిస్తున్నది చూడాలి.