ఉపాధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతల స్వీకరణ

I-have-great-experience-we-can-transform-this-country-Rahul-Gandhiరాహుల్ గాంధీ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ ఉపాధ్యక్ష హోదాలో తొలిసారి రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ.. యువతను రాజకీయాల్లోకి తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. రాజకీయాల్లో మార్పునకు కాంగ్రెస్ పార్టీ సరైన వేదికన్నారు. పాజిటివ్ రాజకీయాలే దేశాన్ని ముందుకు నడిపిస్తాయని.. యువత, అనుభవజ్ఞులైన నేతలతో కాంగ్రెస్ మరింత బలోపేతమవుతుందన్న ఆశాభావాన్ని రాహుల్ వ్యక్తం  చేశారు.