ఆసుపత్రి పాలైన రాజయ్య !

Rajaiah-

అవినీతి ఆరోపణలతో మంత్రి పదవి ఊడిన రాజయ్య ఆసుపత్రి పాలయ్యారు. ఆయన గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అత్యవసర చికిత్స కోసం హైదర్ గూడ ఆపోలో ఆస్పత్రిలో చేరారు. షుగర్ లెవల్స్, రక్తపోటు, గుండె లెప్ట్ వాల్వ్ పనితీరులో తేడా వుందని ఆయన వైద్యం చేసిన డాక్టర్లు వివరించారు. 24 గంటలపాటు ఐసీయూలో ఉన్నారు. అయితే, తాజాగా ఆరోగ్యం కుదుటపడటంతో.. ఆసుపత్రి నుంచి రాజయ్య డిఛార్జి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో ఆవేదనకు గురయ్యాను. పదవి నుంచి తొలగించగానే చాలా ఒత్తిళ్లు వచ్చాయి. అవినీతి ఆరోపణలపై ఎంక్వైరీ చేయాలని…కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని…ఎవరూ ఆందోళన చేయాల్సిన అవసరం లేదన్నా”రు. కాగా, అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజయ్యను మంత్రి పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. రాజయ్య స్థానంలో వరంగల్ ఎంపీగా వున్న కడియం శ్రీహరిని కాబినేట్ లోకి తీసుకున్నారు.