రాహుల్ ని కవర్ చేస్తున్న రేణుక

renuka
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభలో నిద్రపోవడం మళ్ళి చర్చకు దారితీసింది. ఆయన కునుకు తీస్తున్న పుటేజ్ మీడియాకి చిక్కడం దాన్ని టెలికాస్ట్ చేసి రాద్ధాంతం చేయడం మహా జోరుగుగా జరుగుతుంది. అయితే ఇప్పుడీ విషయంలో రాహుల్ ని కవర్ చేసే భాద్యత కాంగ్రెస్ నాయకులు తీసుకున్నారు. దీనిపై పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి మాట్లాడుతూ.. మీడియాది అనవసర రాద్ధాంతం అని ఫైరయ్యారు. రాహుల్ నిద్ర పోవడం లేదని, కేవలం కళ్లు మూసుకుని మాత్రమే కూర్చున్నారని, ఇందుకు సంబంధించిన రాహుల్ ఫొటోను చూపిస్తున్న మీడియాకు పనీపాటాలేనట్టుందని విమర్శించారు రేణుక.