కాంగ్రెస్ కి షాక్ ఇవ్వబోతున్న రేవంత్ రెడ్డి !


తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. ఆ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నాడా.. ? అనే అవుననే అంటున్నారు రాజకీయ వర్గాలు. ఆయన కాంగ్రెస్ రాజీనామా చేసే యోచనలో ఉన్నాడట. ఈ మేరకు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. పోటీనుంచి కూడా తప్పుకుంటానని ఆయన అన్నట్టు వార్తలొస్తున్నాయి.

టీడీపీలో కీలక నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకి కాంగ్రెస్ లో పెద్ద పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది. కాస్త ఆలస్యంగానైనా ఆయనకి వర్కింగ్ ప్రెసిండెంట్ పదవి దక్కింది. ఐతే, ఆయన కోరుకుంటున్నట్టు ఆయన వర్గానికి దాదాపు 20 సీట్లు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నట్టు సమాచారమ్.

తన వర్గానికి 20 సీట్లు కావాలనే ముందస్తు ఒప్పందం తర్వాతే రేవంత్ కాంగ్రెస్ లో చేరారట. ఇటీవల ఢిల్లీలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలోనూ తన వర్గానికి 20సీట్ల కేటాయింపుపై రేవంత్ పట్టుపట్టినట్టు వార్తలొచ్చాయి. ఆయన ఆశించినన్ని సీట్లని కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వకపోవడంతో రేవంత్ అసంతృప్తితో ఉన్నారు. అధిష్టానంపై అలకబూననట్టు తెలుస్తోంది.