పుష్కరాలని పెద్దగా పట్టించుకోని కేసీఆర్.. కారణం ఏంటో ?

kcr-babu
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారంతో కృష్ణా పుష్కరాలకి తెరపడింది. 12రోజులుగా సాగిన కృష్ణాపుష్కరాల్లో లక్షల మంది పుణ్యస్థానం ఆచరించారు. అయితే, కృష్ణా పుష్కరాల్లో తెలుగు ముఖ్యమంత్రుల పనితీరుపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరే పని పెట్టుకోకుండా.. పుష్కరాలే పెద్ద పనిగా పనిచేశారు. సాయంత్రం కృష్ణమ్మకి హారతి సమయంలో ప్రజలతో రోజుకో సంకల్పం చేయిస్తూ వచ్చారు. గోదావరి పుష్కరాల్లో చోటు చేసుకొన్న తొక్కిసలాట అనుభవం నేపథ్యంలో.. ఈసారి అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు బాబు. ఇక, చివరి రోజు ఒలంపిక్స్ లో రజత పతకం తెచ్చిపెట్టిన పివి సింధూ,కోచ్ గోపీ చంద్ ల సన్మాన కార్యక్రమం హైలైట్ నిలిచింది. మొత్తానికి.. పుష్కరాలలో చంద్రబాబు లీనమైన తీరుకి వందకి వంద మార్కులు పడతాయి అంటున్నారు నెటిజర్లు.

మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కరాలని పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలొస్తున్నాయ్. పుష్కరాల ప్రారంభం రోజున పుష్కర స్థానం చేయడం.. ఆ మధ్యలో ఒకట్రెండు సార్లు రివ్యూ చేయడం తప్ప పెద్దగా పుష్కరాలపై కేసీఆర్ స్పందించింది లేదు. తెలంగాణలో ముస్లిం ఓటు బ్యాంకు కాపాడుకునేందుకే ఎక్కువగా పుష్కరాలపై ఫోకస్ చేయలేదనే గుసగుసలు వినబడుతున్నాయి. అయితే, ఇందులో వాస్తవం లేదని సీఎం క్యాంప్ ఆఫీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలని సమానంగా చూస్తారు. అయితే, ఈ సారి పుష్కరాల సమయంలోనే.. కొత్త జిల్లాల ఏర్పాటు అంశం, మహారాష్ట్రతో జల ఒప్పదం.. తదితర అంశాలతో కేసీఆర్ బిజీగా ఉన్నారని.. అందుకే పుష్కరాలపై పెద్దగా ఫోకస్ చేయలేకపోయారని చెప్పుకొస్తున్నారు. అయితే, మంత్రులు, ప్రభుత్వం యంత్రాగం తెలంగాణలో కృష్ణ పుష్కరాల నిర్వహణని విజయవంగా నిర్వహించారని అంటున్నారు. ఇదీ నిజమే.

మరీ.. సోషల్ మీడియాలో పుష్కరాలని పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎందుకు ప్రచారం జరుగుతుందో తెలియడం లేదు. ప్రాధాన్యతల అర్థం చేసుకొని ఇలాంటి ప్రచారానికి పులిస్టాప్ పెట్టాలని తెరాస వర్గాలు అంటున్నాయి. మరీ.. ఇప్పటికైనా పుష్కరాల విషయంలో కేసీఆర్ పై నెగటివ్ ప్రచారం ఆగుతుందో చూడాలి.