సాగర్ లో సగం మాదే : ఏపీ

sagar తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పటికే అనేక అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా, సాగర్ పై సమరం మొదలైంది. నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణపై తమకు భాగం ఉందని ఎపీ నీటిపారుదల శాఖ అధికారులు లేఖ రాశారు.
ఏపీ అధికారులు రాసిన లేఖను డ్యామ్ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి అందజేశారు.

జాతీయ సంపద అయిన నాగార్జున సాగర్ ప్రాజెక్టను పంచనామా చేసి, తమ భాగం తమకు అప్పగించాలని ఏపీ ఇంజినీర్లు గుంటూరు జిల్లా మాచర్ల తహశీల్దార్, సీఐలకు లేఖలు రాశారు. డ్యామ్లో సగభాగం తమదేనని, 13 గేట్ల నిర్వహణను తామే నిర్వహిస్తామని ఇంజినీర్లు ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనలు చేయలేదు.

మొత్తానికి.. తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం మొదలైనట్టే కనిపిస్తోంది. మరీ.. సాగర్ సమరం చివరకు.. ఏ తీరాన్ని చేరుతుందో వేచి చూడాలి. ఈ మేరకు విభజన చట్టంలో ఏమైనా పేర్కొన్నారా.. ? అన్న దానిపై తెలంగాణ అధికారులు ఆరా తీయడం మొదలెట్టినట్లు సమాచారమ్.