తెలుగు జాతిని చీల్చొద్దు : ఏపీ ఎన్ఆర్ఐ

Samaikya-heat-in-USAరాష్ట్ర విభజన పేరిట తెలుగు జాతిని చీల్చొద్దని అంటున్నారు ప్రవాసాంధ్రులు. న్యూజెర్సీలో జరిగిన సమైక్య ప్రవాసాంధ్ర సదస్సులో.. రాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచాలని ఎన్ ఆర్ లు డిమాండ్ చేశారు. తెలుగు జాతిని సమైక్యంగా వుంచేందుకు ఎలాంటి పోరాటానికైనా.. వెనుకాడబోమని ఎన్ ఆర్ ఐలు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విడదీయకుండా వుంచేందుకు గత మూడు సంవత్సరాల క్రితం ఏపీ ఎఆర్ ఐ ఏర్పడింది. అయితే, కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే గాక, ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుండటం, దానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉవ్వెత్తున సమైక్య సెగలు చెలరేగడంతో.. ఏపీ ఎన్ ఆర్ ఐ పోరం న్యూజెర్సీలో ప్రవాసాంధ్ర సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు ప్రముఖ కళాకారుడు గజల్ శ్రీనివాస్ హాజరయ్యారు.

గతంలో తెలంగాణపై ఏర్పడిన శ్రీకృష్ణ కమిటీకి కూడా నివేదిక అందించామని ఎన్ ఆర్ ఐ లు పేర్కొన్నారు. మరోసారి ఢిల్లీ వచ్చి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలసి నివేదికలు సమర్పించనున్నట్లు వారు పేర్కొన్నారు. అవసరమైతే.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకు కూడా వినతి పత్రాన్ని అందించే ఆలోచనలో వున్నారు ఏపీ ఎన్జీవోలు. ఏపీ ఎన్జీవోలు మొదలు పెట్టిన సమైక్య ఉద్యమం ఎంతలా విజృంబిస్తుందో వేచి చూడాలి. దేశంలో వుండి సమైక్యం గురించి పని చేయలేని నాయకులకంటే.. విదేశాల్లో వుండి కూడా తమ తెలుగు జాతి గురించి గొంతెత్తిన ఎన్ ఆర్ ఐలను పలువురు సమైక్యవాదులు అభినందిస్తున్నారు.