ఆఫ్రిది పొలిటికల్ ఎంట్రీ

sahid
క్రికెటర్లకు రాజకీయాలు కామనే. ఇప్పటికే ప్రపంచం వ్యాప్తంగా చాలా మంది క్రికెటర్లు రాజకీయాల్లో వున్నారు. పాకిస్థాన్ లో నైతే మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఏకంగా ఓ పార్టీ నడుపుతున్నాడు. ఇప్పుడు మరో పాక్ క్రికెటర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతడే .. షాహిద్‌ అఫ్రిది. ఈ విషయాన్ని స్వయంగా ఆఫ్రిదినే వెల్లడించాడు.‘నేను రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నాను. ప్రజలకు సేవ చేసేందుకు ఇదే సరైన మార్గమని నేను నమ్ముతున్నా. త్వరలోనే తన రాజకీయ పయనం పై ఓ ప్రకటన ఇవ్వబోతున్నా’ అని వెల్లడించాడు ఆఫ్రిది.