టీ హబ్ వాయిదా…

t-hubతెలంగాణ సర్కారు ప్రారంభించాలనుకున్న టీ హబ్ వాయిదా పడింది. సెప్టెంబర్ ఏడో తేదీన టీ హబ్ను రతన్ టాటా చేతుల మీదగా ప్రారంభం కావాల్సివుంది. మొదటి దశలో గచ్చిబౌలిలోని త్రిబుల్ ఐటీలో 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ప్రారంభించబోతున్నారు. అయితే రతన్ టాటా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రతన్ టాటా తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నట్టు సమాచారం. అందుకోసమే దీన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. రెండు వారాల పాటు టీ హబ్ ప్రారంభోత్సవం పోస్ట్ పోన్ అవుతుందని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు.

టీ హబ్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సర్కారు భావించింది. అందుకోసం గత నెల్లో ముంభై వెళ్లి రతన్ టాటాను కలిశారు ఐటీ మంత్రి కేటీఆర్. దేశంలో అతిపెద్ద ఇంక్యూబెటర్ సెంటర్ ను తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నామని…దాని ప్రారంభోత్సవం ఆయన చేతులు మీదగా చేయనున్నట్టు రతన్ టాటాకు తెలపగా…అందుకు ఆయన అంగీకరించారు. దాంతో సెప్టెంబర్ 7 న టీ హబ్ ప్రారంభించాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు రెడీ చేశారు. తీరా సమయం దగ్గర పడుతున్న టైంలో ఆయన అనారోగ్యానికి గురి అయ్యారు. దాంతో అనివార్యంగా టీ హబ్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసుకుంది సర్కారు.

టీ హబ్ కు ఈ ఏడాది జనవరి 23న శంకుస్థాపన చేశారు. 2017 నాటికి దీన్ని పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. రెండు దశల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో 400 కంపెనీలు, 3 వేల మందికి ఉపాధే లక్ష్యంగా టీ హబ్ ఏర్పాటు కానుంది. రెండో దశ 2017లో ప్రారంభమై… 2018లో పూర్తి కానుంది. రెండో దశలో మూడు లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు కానుంది. దానికోసం రాయదుర్గంలో మూడే్కరాల సర్కారు భూమిని కూడా గుర్తించారు. మొత్తంగా సెప్టెంబర్ మాసంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ… టీ హబ్ను ప్రారంభించాలనుకుంటోంది కేసీఆర్ సర్కారు.