బీజేపీలో.. టీ-విబేధాలు !

BJP-logoతెలంగాణ అంశం ’బీజేపీ’లోనూ.. విభేదాలకు దారితీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే.. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన భాజపా నేతలు ఢిల్లీఎ వెళ్లి అధిష్టాన పెద్దలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. రాష్ట్రాన్ని విభజించడం మంచిది కాదని.. విభజన హిందుత్వానికి, దేశ ఐక్యతను దెబ్బతీస్తుందని వారు పార్టీ పెద్దలకు సూచించారు. తాజాగా, భాజపా తెలంగాణ నేతలు కూడా ఈరోజు ఉదయం పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. అయితే, త్వరలో కేంద్రం నిర్వహించబోయే.. అఖిలపక్షం లో రెండు అబిప్రాయాలకు తావివ్వరాదని నేతలు కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణ మద్దతు విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఈ సందర్భంగా రాజ్ నాద్ సింగ్ స్పష్టం చేసినట్లు తెలంగాణ నేతలు చెబుతున్నారు. కాగా, తెలంగాణలో పార్టీ బలోపేతంపై కూడా వారు చర్చించినట్లు సమాచారం. బండారు దత్తాత్రేయ, నాగం జనార్ధనరెడ్డి రాజేశ్వరరావు తదితరులు రాజ్ నాథ్ సింగ్ ను కలసిన వారిలో వున్నారు.

విభజన నేపథ్యంలో.. దాదాపు అన్ని పార్టీలో సీమాంధ్ర, తెలంగాణ నేతల్లో చీలిక వచ్చినప్పటికినీ.. భాజాపాలో ఈ రకమైన పోరు కాస్త తక్కువగానే వుందని చెప్పాలి. అది కాస్త రోజు రోజుకు రాజుకుంటున్నట్లు కనిపిస్తోంది. సీమాంధ్ర నేతలు విభజనను సాయనివ్వొద్దు.. అంటే.. తెలంగాణ నేతలు సహకరించండని విన్నవిస్తున్నారు. మరీ.. భాజాపాలో ఇప్పుడిప్పుడే.. రాజుకుంటున్న ఈ రకమైన పోరు ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి…