కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు !

sr ntr
తిరుపతిలో జరుగుతున్న టీడీపీ వార్షిక వేడుక ‘మహానాడు’ లో ఆ పార్టీ సీనియర్ నేత,పార్లమెంటు సభ్యుడు మాగంటి మురళీమోహన్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు పేరును ఆయన సొంత జిల్లా కృష్ణా జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశారు మురళీమోహన్. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని మురళీమోహన్ అనగానే పార్టీ నేతలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ మద్దతు పలికారు.