తెదేపా, తెరాసల “సహకారం”

tdp-trsతెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి టీడీపీ ముద్దుకొచ్చింది. ఈ విషయాన్ని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్రావు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నందుకే సహకార ఎన్నికల్లో గెలుపొందిన టిఆర్ ఎస్ అభ్యర్థులకు టిడిపి బేషరుతుగా మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తొలివిడత సహకార సంఘాల ఎన్నికల్లో భాగంగా తెలంగాణ జిల్లాలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే అత్యధిక స్థానాలు గెలుపొందారు. కాగా, ఖమ్మం జిల్లాలో మాత్రం తెదేపా స్పష్టమైన ఆధిక్యం కనబర్చగా, మెదక్ జిల్లాలో టీఆర్ ఎస్ కూడా మెజారిటీ స్థానాల్లో గెలుపొందింది. కాగా సాధ్యమైనంత వరకు కలిసికట్టుగా డిసిసిబిలను కైవసం చేసుకునే విధంగా టిఆర్ఎస్, టిడిపిలు ఒక్కటయ్యే అవకాశాలున్నాయి. తెదేపా, టీఆర్ ఎస్ ల సాన్నిహిత్యం సహకార ఎన్నికల వరకేనా… లేదా భవిష్యత్ లోకూడా ఇలా భేషరత్ గా మద్ధతు ప్రకటించికుంటాయో.. వేచి చూడాలి మరీ!