తెలంగాణ కేబినెట్ సమావేశం రద్దు

kcr

తెలంగాణ కేబినెట్ సమావేశం రద్దు అయింది. సోమవారం జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వర్షాల కారణంగా రద్దు చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదలు కారణంగా మంత్రులు జిల్లాల్లోనే ఉండి పరిస్థితులను సమీక్షించాలని సూచించారు.

మంత్రులు, అధికారులు ఆయా జిల్లాల్లో పర్యటించి.. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రాజెక్టులు, చెరువుల సందర్శనకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, మంత్రులు జిల్లా కేంద్రాలను వదిలి ఎక్కడికి వెళ్లవద్దని ఆదేశించారు.