తెలంగాణ ఇవ్వొచ్చు : టీజీ

TG Venkatesకేంద్రం ఈ నెల 28లోగా తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తామని చెప్పిన నేపథ్యంలో ఇటు తెలంగాణ అటు సీమాంధ్ర రాజకీయ నాయకులు తమ తమ వాదనలు గట్టిగా వినిపిస్తున్నారు. కేంద్రంలో మారే రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రాజకీయనాయకులు వారి బాణీని వినిపిస్తున్నారు. తాజాగా తెలంగాణ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ అంశం కేవలం ఆంధ్రప్రదేశ్ సమస్యనే కాదు, దేశ సమస్యలతో ముడిపడి ఉందని ఆయన తెలిపారు. విడిపోవాలనుకున్నప్పుడే పోరాటాలు ఉంటాయని వెల్లడించారు. సమైక్యంగా ఉండాలనకున్నప్పుడు పోరాటాలు అవసరం లేదని మంత్రి అన్నారు.