సినిమా స్టార్ల కంటే ’కేసీఆరే’ ఫేమస్సు..

2015-01-28_283_cnn-ibnసినిమా స్టార్ల కన్నా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే ఫేమస్సు అనిపించుకొన్నాడు. బాలీవుడ్ టాప్ స్టార్స్ అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ల.. కంటే కేసీఆరే టాప్ లో నిలిచాడు. నేషనల్ న్యూస్ చానల్ ‘సీఎన్‌ఎన్-ఐబీఎన్’ నిర్వహిస్తున్న ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ – 2014’ అవార్డు రేసులో సీఎం కేసీఆర్ టాప్ ప్లేస్ కు చేరుకున్నారు. ఆన్ లైన్ ఓటింగ్ లో కేసీఆర్ 31 శాతం ఓట్లు సంపాదించి ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా.. సీఎన్‌ఎస్-ఐబీఎన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీవాస్తవ సీఎం కేసీఆర్ ను సచివాలయంలో కలుసుకుని… తమ సంస్థ తరపున ఆయనకు అభినందనలు తెలిపారు.

దేశంలోని సినిమా, రాజకీయ, క్రీడలు, సైన్యం, ఇతర రంగాలలో విశేష ప్రతిభ ఉన్న పలువురిని ఈ పోటీకి ఎంపిక చేయగా అందరికన్నా ఎక్కువశాతం ఓట్లు సాధించి కేసీఆర్ ప్రథమస్థానంలో నిలవడం విశేషం. కేరళలో మత్తు మందులకు వ్యతిరేకంగా పోరాడుతున్న విజయన్ 22 శాతం ఓట్లతో తర్వాతి స్థానంలో ఉన్నారు. ఆ తరువాత సల్మాన్ ఖాన్ ఏడుశాతం, అమీర్ ఖాన్ ఆరుశాతం, ఇండియన్ ఆర్మీ – ఎన్డీఆర్ఎఫ్ ఐదు శాతం, సత్య నాదెళ్ల, అమిత్ షా, నాలుగు శాతం, సానియా మీర్జా, ఇండియన్ హాకీం టీం, చేతన్ భగత్, చందనా కొచ్చర్ తదితరులు కేవలం రెండు శాతం ఓట్లను సంపాదించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో.. కాంగ్రెస్ కోరలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్.. మళ్లీ మరోసారి సత్తా చాటారని గ్రేట్ గా చెప్పుకొంటున్నారు గులాభి వర్గాలు.