ఈ నెలలోనే రుణమాఫీ

harish rao
తెలంగాణ రైతులకు శుభవార్త. ప్రభుత్వం ఈ నెలలోనే రైతు రుణమాఫీ చేయనుంది. ఈ మేరకు మంత్రి హరీష్ రావు నేడు ఓ ప్రకటన చేశారు. ఈ నెలాఖరుకల్లా రుణమాఫీ చేయకపోతే రైతులపై అపరాధ రుసుం పడే ప్రమాదం ఉందని.. అందుకే రుణమాఫీ నిర్ణయాన్ని త్వరగా తీసుకున్నామని మంత్రి ప్రకటనలో తెలిపారు.

రైతు రుణమాఫీ విషయంలో.. తెరాస ప్రభుత్వంపై విమర్శణాస్త్రాలను సంధిస్తున్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను హరీష్ ఖండించారు. కిషన్‌ రెడ్డికి చేతనైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించాలని సూచించారు. రుణమాఫీపై చంద్రబాబులా తాము మెలిక పెట్టలేదన్నారు. ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయో ప్రజలు గమనించాలని కోరారు. మెదక్ ఉప ఎన్నికలో ప్రజలు మెట్టికాయలు వేసిన బీజేపీ నేతల తీరు మారలేదని హరీష్ విమర్శించారు.