గ్రామజ్యోతి మార్గదర్శకాలు

grama-jyothiగ్రామాలకు ఆర్ధిక పురిపుష్టి కల్పించడంతో పాటు అన్ని రంగాల్లో వాటిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది సర్కారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 8685 గ్రామపంచాయితీలున్నాయి. ఈ గ్రామపంచాయితీల్లో సుమారు 87,838 వార్డులున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారంగా రాష్ట్ర జనాభా 2 కోట్ల 26 లక్షల88 వేల 576 మంది. ఇందులో దళితులు 29 లక్షల01 వేల 266 మంది..ఎస్ టి జనాభా 42 లక్షల 12 వేల 900 మంది. రానున్న రోజుల్లో గ్రామాలను సమగ్రంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.14వ,ఫైనాన్స్ కమీషన్ ద్వారా రానున్న ఐదేళ్ళ పాటు సుమారు 5375.53 కోట్ల రూపాయాలు వస్తాయని కేసీఆర్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.ఈ నిధులను సక్రమంగా
వాడి గ్రౌండ్ లెవల్లో అభివృద్ధి చేయాలనుకుంటోంది

ఎన్ఆర్ ఎల్ ఎం, ఎన్ హెచ్ ఆర్ ఎం,ఎస్ ఎస్ ఎ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నుండి వచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడ నిధులను నేరుగా గ్రామపంచాయితీలకు కేటాయించనుంది. రానున్న నాలుగేళ్ళ పాటు 25 వేల కోట్లను వివిధ పథకాల కింద గ్రామజ్యోతి పథకం ద్వారా ఖర్చు చేయనుంది సర్కార్. గ్రామజ్యోతి కార్యక్రమం కింద ఏడు అంశాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది.

1.శానిటేషన్ ,డ్రింకింగ్ వాటర్, 2, నాచురల్ రిసోర్స్ మేనేజ్ మెంట్,3.మానవ వనరుల అభివృద్ది,4.ఆరోగ్యం, ఫౌష్టికాహారం,5.వ్యవసాయం,6.సోషల్ సెక్యూరిటీ,దారిద్ర్యాన్ని తగ్గించడం,7.ఇన్ ఫ్రా స్ట్రక్చర్ , రిసోర్స్ మొబిలైజేషన్ కార్యక్రమాలపై సర్కార్ కేంద్రీకరిస్తోంది. ఈ అంశాలపై గ్రామజ్యోతి పనిచేయనుంది.

.గత ఐదేళ్ళ నుంచి గ్రామాల్లో నెలకొన్న పరిస్థితి పై నివేదిక సిద్దం చేసింది ప్రభుత్వం .ఆయా గ్రామాల్లొోని విజయాలు…అపజయాలు…వాటి పరిస్థితులను సమగ్రమైన అంకెలతో సహా అధికారులకు అందుబాటులో ఉంచింది. గ్రామజ్యోతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామజ్యోతి ఫంక్షనల్ కమిటీలు ఏడు మందికి మించకుండా ఉండాలి. ఈ కమిటీలో ముగ్గురి కంటే ఎక్కువగా వార్డు సభ్యులను సెలెక్టు చేయకూడదు. ఒకరు లేదా ఇద్దరు చొప్పున స్వయం సహాయక గ్రూపు లీడర్లను నియమించవచ్చు.రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని ఈ కమిటీలో ఉంచవచ్చు.గ్రామాభివృద్దికి సంబందించిన అనుభవం ఉన్న వారిని కమిటీలో భాగస్వామ్యులను చేయనున్నారు.ఈ కమిటీకి మండలస్థాయి అధికారిని కన్వీనర్ గా ఉంటారు. పంచాయితీరాజ్ ,రూరల్ డెవలప్ మెంట్ శాఖకు చెందిన అధికారి ఒకరు గ్రామజ్యోతి కార్యక్రమం ప్రణాళిక…మార్గదర్శకాల ఆధారంగా గ్రామాల్లో ఫ్లాన్ చేసేందుకు సహాకరిస్తారు.వీరిని ఎక్స్ టెన్షన్ ఆఫీసర్స్ గా పిలుస్తారు.ఎండిఓలు మండల లైన్ డిపార్ట్ మెంట్స్ కు కన్వీనర్ గా ఉంటారు.ఈ కమిటీలో తహాసీల్దార్లు, ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లు,పిఆర్ ఎ.ఇ.లు., ఆర్ డబ్య్లుఎస్. ఎ.ఇలు, ట్రాన్స్ కో ఎ.ఇ లు, మెడికల్ ఆఫీసర్లు, వ్యవసాయశాఖాధికారులు, ఐకెపి ఎపిఎం లు ఉంటారు.

ఇక ప్రతి మండలానికి ఛేంజ్ ఏజంట్ లను నియమిస్తారు. క్షేత్రస్థాయిలో మార్పు కోసం ప్రజలను చైతన్యపరిచేందుకు ఛేంజ్ ఏజంట్ లు పని చేయాల్సివుంటుంది. .గ్రామస్థాయిలోని వివిధ శాఖలను సమన్వయం చేయడం,గ్రామసభలను నిర్వహించడం , ప్రజలను భాగస్వామ్యులను చేయడం ఛేంజ్ ఏజంట్ల విధి. ఇక ఎంపిలు. ఎంఏల్ఏలు….విధిగా గ్రామపంచాయితీలను దత్తత తీసుకొంటారు.వారం రోజుల పాటు గ్రామజ్యోతి మార్గదర్శకాల ప్రకారంగా గ్రామసభలను నిర్వహించి…..పల్లెల అభివృద్ది కోసం ప్లాన్ చేయనున్నారు.