ముందడుగు : తెలంగాణ ‘మహా’ ఒప్పందం

kcr
తెలంగాణలో 39 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ముందడుగు పడింది. గోదావరి నదిపై నిర్మించే బ్యారేజీలకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర మధ్య కీలక ఒప్పందం కుదిరింది. గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చారిత్రక ఒప్పందంతో నీటి పారుదల రంగంలో నూతన అధ్యాయానికి నాంది పలికినట్లయింది.

ఈ సందర్భంగా మాట్లాడిన కేసిఆర్.. ఈ రోజును సువర్ణాక్షరాలతో లిఖించదగినదిగా అభివర్ణించారు. దేశానికి తెలంగాణ, మహారాష్ట్ర సరికొత్త నిర్దేశాన్ని చూపించాయన్నారు. గోదావరి ప్రాజెక్టుపై ఒప్పందంతో దేశంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. ఈ ఒప్పందంతో ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాని, ఈ స్నేహం ఇలానే కొనసాగుతుందని, కృష్ణ జలాలను పొందడానికి కూడా ఇరు రాష్ట్రాల మధ్య కార్యాచరణ సిద్దమౌతుందని చెప్పుకొచ్చారు.