మున్సిపల్ ఎన్నికల పై కేసీఆర్ కి కోర్టు జలక్…!


మున్సిపల్ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని జోరుమీదున్న కేసీఆర్ సర్కార్ కి కోర్టు బ్రేకులేసింది.ఎన్నికలకు ఇంకా 109 రోజులు గడువు ఉన్నా.. ఇప్పుడే ఎందుకంత హడావుడి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా హడవుడిగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. ప్రజల అభ్యంతరాల్ని పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించినట్టు ఎన్నికల సంఘం కూడా హైకోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

నిన్న తెలంగాణ కేబినెట్ భేటి అయి కొత్త మున్సిపల్ బిల్లుకు ఆమోదం తెలిపింది. బిల్లు అమోదించడానికి ఈరోజు,రేపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుపుతుంది కేసీఆర్ సర్కార్. 1965 తెలంగాణ మున్సిపల్ చట్టం, 1994 తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాల స్థానంలో కొత్త బిల్లుకు రూపకల్పన చేశారు. ఆగస్టులో ఎన్నికలు నిర్వహించాలని స్పీడ్ మీదున్న కేసీఆర్ సర్కార్ కి హై కోర్టు స్పీడ్ బ్రేకులేసింది.