మళ్లీ కేసీఆర్ దే పీఠం..

వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ దే పీఠం అని మరోసారి సర్వేలో తేలింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో చాల సర్వేలు జరుపుగా ఏ సర్వే రిపోర్ట్ చూసిన మళ్లీ విజయడంఖా మోగించేది కేసీఆర్ అనే తేలింది. తాజాగా ఇండియాటుడే చేసిన సర్వేలో తెలంగాణలో గులాబీ పార్టీదే ప్రభంజనమని తేల్చింది.

అక్టోబర్ 22 నుంచి నవంబర్ 6వ తేదీ మధ్య తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలో పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్ (పీఎస్‌ఈ) సంస్థ ఈ శాంపిల్ సర్వే నిర్వహించింది. 6,877మంది ఓటర్ల నుంచి ఫోన్ ద్వారా వివరాలు సేకరించింది. ఈ సర్వే వివరాలను గురువారం విడుదల చేశారు. ఈ సర్వే లో మళ్లీ టిఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని 44% మంది కోరుకోగా , ప్రభుత్వం మారాలని 34 % కోరుకున్నారు. మాకు తెలియదంటూ స్పందించిన వారు 22 %. తదుపరి ముఖ్యమంత్రి గా కేసీఆర్ గా 46 %, ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్ ) కి 25 %, కిషన్ రెడ్డి (బీజీపీ)కి 16 %, కోదండ రామ్ (టిజెఎస్) 7 %, ఒవైసీ కి 4 % మద్దతు పలికినట్లు ఇండియాటుడే సర్వేలో తేలింది. ఈ సర్వేతో మరోసారి తెరాస శ్రేణుల్లో మరింత ఉత్సహం నింపింది.