పవన్ కు తెలంగాణ జనసేన నేతల విజ్ఞప్తి ..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలంగాణ జనసేన నేతలు తమ విన్నపాన్ని తెలియజేసారు. అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో సమావేశమైన నేతలు, కార్యకర్తలు.. ఎన్నికల ఫై చర్చించారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. స్థానిక సంస్థల్లో పోటీపై కార్యకర్తల అభిప్రాయాలను సేకరించాలని తెలిపారు… దానికి అనుగుణంగా సమావేశం నిర్వహించామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పోటీ చేశాం.. స్థానిక సంస్థల్లో కూడా పోటీచేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. ఇందుకు అనుగుణంగా పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తీసుకుని నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్తామని తెలిపారు.