గెలుపు కోసం కేసీఆర్ మరోహోమం..?

తెలంగాణ ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హోమాలపై , దేవుళ్ళ ఫై భక్తి , నమ్మకం ఎంతో ఎక్కువో తెలియంది కాదు..కోట్ల ఖర్చు చేసైనా హోమం చేయడానికి ముందుంటాడు. ఇప్పటికే పలు హోమాలు చేసి వార్తల్లో నిలువగా తాజాగా మరో హోమం చేయబోతున్నాడనే వార్త వినిపిస్తుంది. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు ఇప్పటికే ఎన్నో ప్రతివ్యూహాలు రచిస్తున్న కేసీఆర్.. మరోసారి హోమం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

ఎన్నికల్లో గెలుపు, తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా… భారీ హోమం చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. శంషాబాద్ మండలం ముచ్చింతలలో ఉన్న త్రిదండి చిన్నజీయర్ స్వామి దివ్యసాకేతాశ్రమాన్ని శనివారం సందర్శించిన కేసీఆర్.. ఈ విషయమై వేదపండితులతో చర్చించినట్టు సమాచారం. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గానీ, చిన్నజీయర్ ఆశ్రమంలో గానీ ఈ హోమాన్ని నిర్వహించే అవకాశం ఉంది. మొత్తం మూడ్రోజుల పాటు ఈ హోమం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ హోమాలపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.