ప్రశాంతంగా కొనసాగుతున్న మండలి ఎన్నికల పోలింగ్‌..

శాసనసభ్యుల కోటా శాసన మండలి ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఐదు స్థానాల కోసం జరుగుతున్న ఎన్నికల్లో అరుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌-1లో పోలింగ్ మొదలు అయ్యింది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. పోలింగ్‌లో మొదటి ఓటు హక్కును సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వినియోగించుకున్నారు. రెండో ఓటును టిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌ వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఇప్పటివరకూ 91 మంది తెరాస ఎమ్మెల్యేలు.. ఏడుగురు మజ్లిస్‌ ఎమ్మెల్యేలు ఓటు వేసినట్లు తెలుస్తుంది.

4 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. ఈ ఎన్నికలను కాంగ్రెస్‌ బహిష్కరించగా.. తెదేపా, భాజపా పోలింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి రియాజ్(మజ్లీస్), సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, యెగ్గె మల్లేశం, శేరి సుభాష్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.