తెలంగాణాలో సోనియా ప్రచార షెడ్యూల్..?

తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి పొత్తు తో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా గా ఉంది..ఇటీవల సర్వేలలో కూడా మహాకూటమికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చడం తో కార్య కర్తల్లోనే కాదు ప్రతినిధుల్లోనూ ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా సైతం తెలంగాణ రాష్ట్రంలో తనవంతు ప్రచారం చేసేందుకు షెడ్యూల్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఇటీవల రాహుల్ వరుస పర్యటనలతో తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఫై అందరిలో నమ్మకం పెరిగింది.. ఇదే జోష్ తో ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు సభల్లో రాహుల్ పాల్గొనేలా కార్యాచరణ రూపొందించింది. సోనియా కూడా ప్రచారానికి వస్తే మరింత ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ పాల్గొనేలా షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

నవంబరులోనే సోనియా గాంధీ తెలంగాణకు రానున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 23న రాష్ట్రంలో ఆమె పర్యటిస్తారని సమాచారం. అదే రోజు వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని తెలుస్తోంది. అటు నవంబరు 28, 29న రాహుల్ తెలంగాణలో పర్యటిస్తారని సమాచారం. 28న మహబూబ్ నగర్, 29న ఖమ్మంలో రోడ్ షో, బహిరంగ సభల్లో రాహుల్ పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. ఈ షెడ్యూల్ ఫై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.