భాజపా అభ్యర్థుల జాబితా ఇదే..

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ మొదటివారం లో శాసనసభ ఎన్నికలు జరుగబోతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే తెరాస పార్టీ తమ శాసనసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసే ప్రచారంలో బిజీ అవ్వగా , తాజాగా భారతీయ జనతా పార్టీ సైతం తమ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించింది. అక్టోబరు 20న 38 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన భాజపా, ఇప్పుడు రెండో జాబితా అభ్యర్థులను ప్రకటించింది.

ఈ జాబితాను పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆధ్వర్యంలో జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని 119 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని భాజపా గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక అభ్యర్థుల జాబితా చూస్తే..

చార్మినార్‌ – ఉమామహేంద్ర

కూకట్‌పల్లి- మాధవరం కాంతారావు

చాంద్రాయణగుట్ట – సయ్యద్‌ షహెజాది

యాకుత్‌పురా – రూప్‌రాజ్‌

బహుదూర్‌పురా – అనిఫ్‌ అలీ

మలక్‌పేట – ఆలె జితేంద్ర

శేరిలింగంపల్లి – యోగానంద్‌

వనపర్తి – కొత్త అమరేందర్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌ – నేదనూరు దిలీప్‌ చారి

నాగార్జునసాగర్‌ – కంకనాల నివేదిత

వర్ధన్నపేట – కొత్త సారంగరావు

సిర్పూర్‌ – శ్రీనివాసులు

ఆలేరు – దొతిరి శ్రీధర్‌రెడ్డి

స్టేషన్‌ఘన్‌పూర్‌ – పెరుమాండ్ల

వరంగల్‌ పశ్చిమ – ఎం.ధర్మారావు

ఆసిఫాబాద్‌ – అజ్మీరా ఆత్మారాం నాయక్‌

ఇల్లందు – మొకాళ్ల నాగ స్రవంతి

వైరా – రేష్మ రాఠోడ్‌

సిర్పూరు – డా.శ్రీనివాసులు

జగిత్యాల- ఎం.రవీంద్రరెడ్డి

ఖానాపూర్‌ – సాట్ల అశోక్‌

నిర్మల్‌ – అయిండ్ల సువర్ణరెడ్డి

నిజామాబాద్ అర్బన్‌ – యండెల లక్ష్మీనారాయణ

సిరిసిల్ల- నర్సాగౌడ్‌

రామగుండం – బాల్మూరి వనిత

అశ్వారావుపేట – భూక్యా ప్రసాదరావు

సిద్దిపేట- నరోత్తమ్‌రెడ్డి