బీజేపీకి దూరం జరిగితే టీడీపీకి నష్టం

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మార్పు చెందుతున్నాడయి. 2014 ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో తెలుగు దేశం పార్టీ జాయిన్‌ అయ్యి పోటీ చేసిన విషయం తెల్సిందే. ఏపీలో టీడీపీ మరియు బీజేపీ కూటమికి మంచి స్థానాు దక్కాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ మొదటి నుండి కూడా తలనొప్పిని భరిస్తూనే ఉంది. కేంద్రంలో మోడీకి సొంతంగా మెజార్టీ ఉండటంతో బీజేపీ స్థానాలు ఆయనకు అక్కర్లేకుండా పోయాయి. దాంతో మోడీ ఏపీకి ఏమాత్రం సపోర్ట్‌గా నిలవడం లేదు. టీడీపీని కూడా తీసి పక్కకు పెట్టినట్లుగానే వ్యవహరిస్తున్నాడు.

మంత్రి పదవుల కేటాయింపు నుండి రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు ఇలా అన్నింటిని కూడా మోడీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. దానికి తోడు ఏపీ బీజేపీ నాయకులు ఈ మద్య టీడీపీని ప్రతి విషయంలో కూడా విమర్శించడం చేస్తున్నారు. దాంతో టీడీపీకి ఒల్లు మండుతుంది. త్వరలోనే బీజేపీకి నమస్కారం పెట్టే అవకాశం కనిపిస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా బీజేపీకి ఇష్టం లేకుంటే నమస్కారం పెట్టి తప్పుకుంటాం అని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పోటీ చేయడం అసంభవం అని తేలిపోయింది.

టీడీపీ ఎప్పుడెప్పుడు తప్పుకుంటుందా అని ఎదురు చూస్తున్న వైకాపా వెంటనే బీజేపీతో జత కలిసేందుకు సిద్దం అయ్యే అవకాశం ఉంది. ఏపీలో టీడీపీ కంటే రెండు మూడు స్థానాలను ఎక్కువగానే బీజేపీకి ఆశ చూపించి, తమ బలాన్ని చూపించి జగన్‌ అండ్‌ కో మోడీతో స్నేహం చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఒకవేళ ఏపీలో బీజేపీ, వైకాపా పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది.

ఈ సమయంలోనే మోడీకి అనుకూలంగా, జగన్‌కు మద్దతుగా ప్రజలు నిలిస్తే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని, ఒక వేళ వైకాపా ఒంటరిగా పోటీ చేస్తే జగన్‌కు ప్రభుత్వంను ఏర్పర్చే స్థాయిలో సీట్లు రావు అనేది కొందరి వాదన. మొత్తానికి కష్టమో నష్టమో బీజేపీతో టీడీపీ కలిసి ఉంటేనే మంచిది అనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2019 ఎన్నికలు మరెంతో దూరం లేవు. మరి ఆ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చూడాలి.