2017 తుమ్మడిహెట్టి ప్రాజెక్టును పూర్తి – కెసిఆర్

Thumdi-projectఆదిలాబాద్ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆదిలాబాద్ తూర్పు జిల్లాకు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం పరిశీలిస్తోంది సర్కారు. .2017 చివరినాటికి ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.ప్రాణహిత, ఇంద్రావతి నదుల ద్వారా వచ్చే నీటిని గరిష్టంగా వినియోగించుకోవాలని సిఎం సూచించారు.నిర్మల్..ముథోల్ ప్రాజెక్టును, పెన్ గంగ బ్యారేజీని కూడా త్వరగా నిర్మించే యోచనలో ఉంది. .జిల్లాలో 12 మద్యతరహా నీటి ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టగా…..అందులో పావి ఆరు, కొత్తవి ఆరు ప్రాజెక్టులున్నాయి. . బోథ్ నియోజకవర్గంలోని కుట్టి వద్ద మధ్యతరహా ప్రాజెక్టును నిర్మించాలని సిఎం చెప్పారు.అన్ని రకాల ప్రాజెక్టులను 2018 నాటికి పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు.

రాష్ట్రంలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే జిల్లా ఆదిలాబాద్…ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలని సిఎం సూచించారు. గోదావరి నదిపై మహారాష్ట్ర చెక్ డ్యామ్ లు నిర్మించడం వల్ల దిగువకు నీటి ప్రవాహాం తగ్గిందన్నారు. ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ శాఖల ద్వారా నదులు, వాగులు, కాలువలపై వంతెనల నిర్మాణం సమయంలో తప్పక వాటికి అనుబందంగా చెక్ డ్యామ్ లను నిర్మించాలని సిఎం అధికారులను ఆదేశించారు. నీటి పారుదల శాఖ అదికారులతో చర్చించి వంతెనల డిజైన్లను రూపొందించాన్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణకు వేర్వేరుగా హైడ్రాలజీ విభాగాలను ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు.