బాబా రాందేవ్ తో ఎంపీ కవిత మీటింగ్.. ఏంటి మేటరు

kavitha

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె.. టీఆర్ ఎస్ ఎంపీ కవిత కలిశారు. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని బాబా రాందేవ్ తో కవిత భేటి కావడం సహజంగానే ఆసక్తి రేపుతుంది.

అయితే బాబా రాందేవ్ ఇప్పుడు పారిశ్రామికవేత్తగా కూడా జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాబా రాందేవ్ తన పతంజలి ఉత్పత్తి కేంద్రాల్ని దేశ వ్యాప్తంగా పలు చోట్ల ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని నాయుడుపేటలో కూడా ఓ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు.

ఈ నేపధ్యంలో ఎంపీ కవిత ఆయన్ను కలిశారు. పసుపు పంటకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు విషయంపై కవిత ఈ సందర్భంగా రాందేవ్ మద్దతు కోరారు. పతాంజలి నుంచి రైతులకు మేలు జరిగేలా పసుపు ఆధారిత పరిశ్రమను నిజామాబాద్ లో ఏర్పాటు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వినతి పత్రం సమర్పించారు. కవిత విజ్ఞప్తికి బాబా రాందేవ్ కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం.