2019 గణతంత్ర వేడుకలకు ట్రంప్‌ హాజరవుతాడా..?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ జాన్ ట్రంప్ 2019 గణతంత్ర వేడుకలకు హాజరవుతాడా..అంటే ఇప్పుడేం చెప్పలేం అంటుంది కేంద్రం. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కేంద్రం ఆహ్వానించింది. అయితే దీనిపై ఇంకా అమెరికా నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఆ అధికారిక ప్రకటన కోసం భారత్ వేచిచూస్తోంది.

కొద్దీ రోజులుగా భారత్‌కు అనుకూలంగా ట్రంప్ సర్కారు వ్యవహరించడాన్ని బట్టి చూస్తే ఏప్రిల్‌లో పంపిన ఆహ్వానం పట్ల సానుకూలంగా ఉన్నట్టు అర్థమవుతోంది. భారత్ ఆహ్వానంపై ఇరు దేశాల దౌత్యాధికారుల మధ్య పలుసార్లు ఇప్పటికే చర్చలు జరిగాయి. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావడానికి ట్రంప్ అంగీకరిస్తే, ప్రధాని మోదీ హాయాంలోనే వచ్చిన రెండో అమెరికా అధ్యక్షుడవుతారు. ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత నిర్వహించిన 2015 గణతంత్ర వేడుకలకు నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెల్సిందే. మరి 2019 లో ట్రంప్ వస్తాడో రాడో చూడాలి.