మార్కెట్ యార్డుల్లో టియస్ సర్కార్ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు

Harishఅన్న‌దాత‌ల‌ను ద‌ళారుల నుంచి ర‌క్షించేందుకు రెడీ అయింది మార్కెటింగ్ శాఖ‌. రైతు పండించిన పంట‌కు స‌రైన ధ‌ర క‌ల్పించ‌డమే లక్ష్యంగా ప‌నిచేస్తోంది ప్ర‌భుత్వం. నిల్వ చేసిన పంట‌కు రైతు బంధు ప‌థ‌కం ద్వారా వ‌డ్డీ లేని రుణాల‌ను ఇస్తోంది. అలాగే పంట నిల్వ‌ల కోసం అద‌న‌పు గోదాంల నిర్మాణంపై ద్రుష్టిపెట్టింది. నాబార్డు స‌హాయంతో 1024 కోట్ల రుణం తీసుకోని గోదాంల నిర్మాణం చేప‌ట్టింది. కొత్త‌గా 128 గోదాముల నిర్మాణాల‌కు కొత్త‌గా చేప‌ట్టింది కేసీఆర్ స‌ర్కారు. అలాగే ఈ ఏడాది కూడా కొత్త‌గా మ‌రో 202 గోదాముల నిర్మాణం చేప‌ట్టాల‌నుకుంటోంది స‌ర్కారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మార్కెట్ యార్డుల్లో మౌలిక స‌దుపాయాల కోసం 80 కోట్ల రూపాయ‌ల‌ను కూడా కేటాయించింది. రైతుల‌కు భోజ‌న వ‌స‌తి, విశ్రాంతి భ‌వ‌నాలు, క్యాంటీన్ల నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు.

ఇక పండిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించేందుకు స‌ర్కారు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంది. ద‌ళారుల ప్ర‌మేయాన్ని త‌గ్గించి… రైతే నేరుగా ల‌బ్ధి పొందేలా చ‌ర్య‌లు తీసుకోనుంది. ప‌త్తి సాగు చేసిన రైతుల‌కు ముందుగానే గుర్తింపు కార్డులివ్వనున్నారు. సీసీఐ కోనుగోలు కేంద్రాల‌ను అక్టోబ‌రు 10 నుంచి ప్రారంభించ‌బోతున్నారు. ఈసారి 90 కేంద్రాల్లో సీసీఐ కేంద్రాలను ప్రారంభించ‌బోతున్నారు. అలాగే ప్ర‌తి రెవెన్యూ డివిజ‌న్ల్ లోరైతు బ‌జారు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది స‌ర్కారు. రైతుల నుంచి ఫిర్యాదులు, స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను తీసుకునేందుకు అన్ని మార్కెట్ యార్డుల్లో ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌బోతోంది సర్కారు. అలాగే ఏ మార్కెట్లో ఏం జ‌రుగుతుందో తెలుసుకోవ‌డానికి, లావాదేవీల‌ను ప‌ర్య‌వేక్షించ‌డానికి కోనుగోళ్ల‌పై నిరంత‌ర స‌మీక్ష జ‌రిపేందుకు సాంకేతిక స‌మాచార వ్య‌వ‌స్థ ను కూడా వాడుకోబోతోంది స‌ర్కారు.