చంద్రబాబుతో బ్రిటన్ హైకమిషనర్‌ మీటింగ్

cbn (15)
ఏపీ సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు బ్రిటిష్‌ హైకమిషనర్‌ డొమినిక్‌ ఆస్కిత్‌. అమరావతిలో పెట్టుబడులు పెట్టేలా బ్రిటన్‌లోని ప్రైవేట్‌ సెక్టార్‌ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, కనీస వసతుల ఏర్పాటుకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తూ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.యూకే సహకారంతో తలపెట్టిన ఆసుపత్రి ప్రాజెక్టుకు భూ కేటాయింపులతో పాటు వివిధ అనుమతులు ఎలా ఇస్తోంది ఈ సందర్భంగా చంద్రబాబు .. ఆస్కిత్‌కు వివరించారు. దీనితో పాటు మరి కొన్ని విషయాలు వీరి మధ్య చర్చలోకి వచ్చాయి.