అఖిలపక్ష భేటీ జాప్యం కోసం కాదు : విహెచ్

VHకేంద్ర హోంమంత్రిత్వ శాఖ మరో అఖిలపక్ష భేటీ పై నేతల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్న నేపధ్యంలో అఖిలపక్ష భేటీను సమర్ధించారు రాజ్యసభ సభ్యుడు వి. హనమంతురావు . తెలంగాణపై జాప్యం కోసం భేటీ నిర్వహించడం లేదని వివరణ ఇచ్చారు. అందరి అభిప్రాయాలు తీసుకోలేదనే అపవాదు తొలగించుకునేందుకు అఖిలపక్ష భేటీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఇక విజయమ్మ పర్యటన గురించి చెబుతూ .. విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారని, ఏం చేస్తారో ఇక తెలంగాణ ప్రజల ఇష్టమనితెలిపారు.