గవర్నర్‌ ఏపీ పక్షపాతి.. తక్షణమే తొలగించండి

governor narasimhan

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు. నరసింహన్‌ ఆంధ్రప్రదేశ్‌ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, తక్షణమే ఆయన్ని తొలగించి వేరే వ్యక్తిని నియమించాలని డిమాండ్‌ చేశారు వీహెచ్‌.

దిల్లీ పర్యటనకు వెళ్ళిన గవర్నర్ ప్రధాని మోదీని కలిసిన ఆంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీ, ప్రత్యేక హోదాలపై సమాచారం అందించారే తప్ప.. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, మల్లన్నసాగర్‌ రైతుల ఇబ్బందులు, రైతుల ఆత్మహత్యలు, పోలీసుల లాఠీఛార్జి, మహిళలపై బలప్రయోగం చేయడం వంటి విషయాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లలేదని, ఆయనకు ఇవన్ని కనిపించలేదని విమర్శించారు.

ఏకపక్షంగా వ్యవహరిస్తున్న నరసింహన్‌ను తెలంగాణ గవర్నర్‌ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో వేరే వ్యక్తిని నియమించాలని కూడా డిమాండ్ చేశారు విహెచ్.