కరుణానిధిని పరామర్శించిన సినీ ప్రముఖులు..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి(94) ఆరోగ్యం ఫై అంత ఆరా తీస్తున్న సంగతి తెలిసిందే..ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని చెన్నైలోని కావేరి ఆస్పత్రి వైద్యులు ఇప్పటికే తెలియజేసారు.అయినప్పటికీ ప్రజల్లో మాత్రం కాస్త ఆందోళన అయితే కొనసాగుతూనే ఉంది. ఇక ఈరోజు ఆయన్ను చూసేందుకు పలువురు సినీ ప్రముఖులు కావేరి హాస్పటల్ కు రావడం జరిగింది.

సూపర్ స్టార్ రజనీకాంత్, ఇలయదళపతి విజయ్ అలాగే అజిత్ కుమార్ లు కరుణనిధిని పరామర్శించారు. కావేరీ ఆస్పత్రికి చేరుకొని ఆయన కుమారుడు స్టాలిన్, ఇతర కుటుంబ సభ్యులను కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొన్నారు. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, ఎంపీ కనిమొళిలని అడిగి తెలుసుకున్నారు. గత శుక్రవారం అర్ధరాత్రి కరుణానిధి రక్తపోటు పడిపోవడంతో ఆయనను చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.