కమలానందకు వాయిస్‌ రికార్డ్‌ పరీక్షలు

No-bail-for-Kamalananda (1)కర్నూలు జిల్లా శ్రీశైలంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న స్వామి కమలానంద భారతికి శుక్రవారం పోలీసులు వాయిస్‌ రికార్డు పరీక్షలు నిర్వహించారు. పది నిమిషాలపాటు సిట్‌ పోలీసులు, ఇద్దరు న్యాయవాదులు, ఫోరెన్సిక్‌ నిపుణులు కలిసి ఈ పరీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై ఆయన్ను అరెస్టు చేయగా కోర్టు 14 రోజుల జుడీషియల్‌ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై చేసిన వ్యాఖ్యలపై టేపులను సేకరించిన పోలీసులు ఆ టేపుల్లో ఉన్న గొంతును కమలానంద భారతి గొంతుతో పోల్చి చూసేందుకు ఈ పరీక్షలు నిర్వహించారు.