వ్యవసాయ మార్కెట్ కమిటీ పోస్టుల భర్తీకి సర్కారు రెడీ

kcrశ్రావణ మాసంలో నామినెటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని చెప్పిన కేసీఆర్ ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. ముందుగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల భర్తీపై దృష్టిపెట్టారు. అందులో మార్కెట్ కమిటీల్లో పదవులను ముందుగా భర్తీ చేయబోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 240 వ్యవసాయ మార్కెట్ కమిటీలుండేవి. రాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ కు 190, తెలంగాణకు 150 మార్కెట్ కమిటీలు అయ్యాయి. తెలంగాణ సర్కారు కొత్తగా మరికొన్ని మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు 40 వరకు కొత్త మార్కెట్ల ఏర్పాట్లకు సంబంధించిన ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి. అవి కూడా వస్తే… తెలంగాణలో వ్యవసాయ మార్కెట్ లు 170 నుంచి 180 వరకు అవుతాయి.

వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవుల భర్తీలో రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. కమిటీల్లో 22 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కేసీఆర్ ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం బీసీల‌కు 33 శాతం మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు కల్పించనున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఏజెన్సీలో ఏరియాల్లో 13 మార్కెట్ కమిటీలున్నాయి. ఏజెన్సీ మార్కెట్ కమిటీల్లో ఛైర్మన్ పోస్టు ఎస్టీలకే దక్కుతాయి. అవిగాక మరో ఆరు శాతం అంటే ఉన్న మార్కెట్ కమిటీల ప్రకారం మరో పది వరకు ఎస్టీ సామాజిక వర్గానికి చైర్మన్ ప‌ద‌వి దక్కే ఛాన్స్ ఉంది. ఆ 13 మార్కెట్ కమిటీలు పోనూ…మిగిలిన వాటికి లాటరీ పద్దతి ద్వారా ఛైర్మన్ పోస్టుల భర్తీ చేపట్టాలనుకుంటోంది కేసీఆర్ సర్కారు. అలా చేయడం ద్వారా మొత్తం కమిటీల్లో 22 శాతం రిజర్వేషన్ అమలు అవుతుంది. అందుకు సంబంధించిన జీవోను విడుదల చేయ‌నుంది తెలంగాాణ సర్కారు.