కేజీ దోశె పిండికి లీటర్ వాటర్ ఫ్రీ…

చైన్నై లో నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సామన్యుడు నుంచి సెలబ్రిటీ వరకు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రావద్దని ప్రాధేయపడుతు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని బతిమాలుతున్నాయి. బిందెడు నీళ్ల కోసం ఉద్యోగాలకు సెలవు పెట్టీ వాటర్ ట్యాంకర్‌ కోసం ఎదురుచూస్తున్నారు. వంటకు నీరు లేక, సాంబారు సమకూర్చలేక చాలా హోటళ్లు కూడా మూతబడుతున్నాయి.

ప్రస్థుతం ఇక్కడ బిందె నీటిని రూ.5 కి అమ్ముతున్నారు.నగరంలో నీటి ఎద్దడిని ఆసరాగా చేసుకున్న ఒక షాపు యజమాని వినూత్నంగా ఒక కేజీ దొశె పిండికి ఒక బిందె నీళ్లు ఫ్రీ అంటు బంపర్ ఆఫరిచ్చాడు. ఇంకేముంది జనాలంతా షాపు ముందు క్యూ కట్టారు. చెన్నైలో నీటి కష్టాలు చూసి హాలివుడ్ హీరో సైతం ట్విట్ చేశాడంటే అక్కడ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇటివల గాయకుడు ఎస్పీ బాలు సైతం చెన్నై నగరంలో స్నానానికి అర బకెట్ నీళ్ళు దొరకలేదని వ్యాఖ్యానించారు.