రివ్యూ : ఆగడు

ag1
|Click here for English Review|
రివ్యూ : ఆగడు | రేటింగ్ : 3.75/5
దూకుడు సినిమా ఓ కంప్లీట్ ప్యాకెజ్.మహేష్ బాబుకున్న భారీ క్లాస్ ఆడియెన్స్ ఫాలోయింగ్ కు తోడు..పక్కా మాస్ ఆడియెన్స్ ఆకట్టుకునే సినిమాగా దూకుడు ను తీసి మహేష్ శ్రీనువెట్ల భారీ బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు..ఈ సినిమా తర్వాత దూకుడు తరహాలోనె సినిమాలు తీసి పలువురు టాప్ హీరోలు సక్సెస్ అందుకున్నారు.అంతలా ఆ సినిమా కొత్త ట్రెండ్ను క్రియేట్ చెసెసింది.అందుకే ఆ కాంబినేషన్లో ఆగడు సినిమా వస్తుందనగానే అంచనాలు ఓరెంజ్ లో ఏర్పడ్డాయి.మరీ ఆగడు ఏ రెంజ్ విజయాన్ని అందుకుందో చూద్దాం…

ఎన్కౌంటర్ శంకర్ అంటే క్రిమినల్స్ కు దడ. బుక్కపట్నంలో క్రైమ్ ఇల్లిగల్ బిజినెస్ చెస్తోన్న దామెదర్ అతని అనుచరుల ఆగడాలను అణచటానికి శంకర్ ఆ ఊరికి సిఐగా వెళతాడు..ఒక్కొక్కటిగా దాము అనుచరులతో ఆడుకుని ఇల్లిగల్ దందాలను క్లోజ్ చెస్తాడు..దీంతో శంకర్ దాముల మద్య వైరం మరింత ముదురుతుంది.అయితే శంకర్ దాముల మద్య చట్టరీత్యా కాకుండా పర్సనల్ గా వైరం ఉంటుంది.. మరీ శంకర్ తన ప్లానింగ్తో దాముని ఏలా శిక్షించాడనేది తెరమీద చూడాల్సిందే..

మహేష్ ఎన్కౌంటర్ శంకర్ గా తన పాత్రతొ 1000% ఎంటర్టైన్ చెసెశాడు. ముఖ్యంగా కామెడీ..పంచ్ యాక్షన్ ..సెంటిమెంట్ సీన్స్లో మహేష్ ఎక్స్ట్రార్డినరీ నటించాడు..కేవలం మహేష్ కోసమే ఆగడు ను ఓ ఆరుసార్లు చూడొచ్చెమో.తమన్నా అందంగా ఉంది.మహేష్ తో పోటిగా నటించింది,డాన్స్లు చెసెసింది.బ్రహ్మానందం,పోసాని ,ఆశిష్ విద్యార్ది ముంతాజ్ రఘుబాబులు వినోదం ఆకట్టుకుంటుంది.నాజర్ దక్షిణామూర్తి గా హస్యాన్ని పంచటం విశేషం. విలన్ గా సోనూసూద్ నటన సాదారణంగానె ఉంది.రాజేంద్రప్రసాద్ ,అజయ్,రవిప్రకాష్ , తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

దర్శకుడు శ్రీనువైట్లకు ఆడియెన్స్కు ఏంకావాలో తెలుసు.మహేష్ ను ఏలా చూపించాలో కూడా బాగా తెలుసు.దూకుడు తరహాలోనె కామెడీని యాక్షన్ ను సమపాళ్లలో జోడించి ఆగడును పుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా మలిచాడు.అయితె దూకుడు తరహాలోనె కాకుండా ఇంకాస్త కొత్తగా రివెంజ్ ఉంటే బావుండేది. గుహన్ సినిమాటోగ్రఫి ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్.తమన్ పాటలు ఆల్రెడీ హిట్.తెరమీద కూడా బావున్నాయి.కానీ రీరికార్డింగ్ పరంగా ఇంకా జాగ్రత్తలు తీసుకుంటే బావుండేది.ఎడిటింగ్ పర్వాలేదు.ఆర్ట్ అన్ని ప్రేమ్స్ లోనూ అదిరింది.

14రీల్స్ వారు నిర్మాతలు కధకు అనసరమైనంత వరకు బాగా ఖర్చుపెట్టారు.సినిమాకు ప్రొడక్షన్ వాల్యూస్ ప్రదానమైన హైలెట్.

ఓవరాల్ గా ఆగడు మహేష్ అభిమానులకు నిజంగానే ఫెస్టివల్.ఆడియెన్స్కు 100% ఎంటర్ టైనర్.కాస్త రోటీన్ రివెంజ్ ఫార్ములా తో తెరకెక్కినా… ఈ ఫెస్టివల్ సీజన్లో ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ క్లీన్ కామెడీ మూవీ ఆగడు.


|Click here for English Review|