రివ్యూ : అనుక్షణం

Anukshanam_Review                                         |Click here for Telugu Review|
సైకో ధ్రిల్లర్‌ – అనుక్షణం

‘రౌడీ’ సినిమా అనంతరం మంచు విష్ణుతో రామ్‌గోపాల్‌వర్మ తీసిన సైకో ధ్రిల్లర్‌ ’అనుక్షణం’. 1970 నుంచి 2006 వరకు మన దేశంలోని కొన్ని ప్రధాన నగరాలలో జరిగిన కొన్ని వరుస హత్యలను స్పూర్తిగా తీసుకొని వర్మ అనుక్షణం సినిమాను తెరకెక్కించటం జరిగింది. గతంలో సైకో కాన్సెప్ట్‌ లతో వర్మ ఒకటిరెండు సినిమాలను నిర్మించటం జరిగింది. కానీ విష్ణు కోసం వర్మ ఈసారి తనే డైరక్టర్‌ గా మారి ఈ అనుక్షణంను రూపొందించాడు. హాలీవుడ్‌ తరహా కాన్సెప్ట్‌ తో ఓ ఇంటెన్స్‌ ధ్రిల్లర్‌ గా తీసిన ఈ సినిమా ఆడియెన్స్‌ను ఎంత వరకు ఆకట్టుకుంటుదో చూద్దాం..

కేవలం తన మానసిక ఆనందం కోసం చిన్నప్పటి నుంచి మర్డర్‌లను చేయటం అలవాటు చెసుకొన్న సీతారం అనే క్యాబ్‌ డ్రైవర్‌ రాత్రి పూట తన క్యాబ్‌ లో ఎక్కే అమ్మాయిలను నిర్మానుష ప్రాంతాలకు తీసుకువెళ్లి అతి కిరాతకంగా చంపుతుంటాడు. అలా ఒకటి రెండుతో మెదలెట్టి వరుసగా అమ్మాయిలను చంపుతున్న ఈ సైకోను పట్టుకునెందుకు క్రైమ్‌ బ్రాంచ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ గౌతమ్‌ తన టీమ్‌తో కలిసి తీవ్రంగా గాలిస్తుంటాడు.అదే టైమ్లో సైకోలపై రీసెర్చ్‌ చేసె శైలజ గౌతమ్‌ టీమ్‌కు కొంత ఇంపార్టెంట్ ఇన్ఫోను అందిస్తుంది. వరుస హత్యలు మీడియాలో హైలెట్‌ కావటంతో పైకో కాస్త ఆనందం కోసం కాకుండా పబ్లిసిటీ కోసం అమ్మాయిలను చంపుతుంటాడు. ఏకంగా హోంమినిస్టర్ మనువరాలనే కిరాతకంగా చంపటంతో విషయం మరింత సీరియస్ గా మారుతుంది. చివరికి మర్డర్‌ మిస్టరీ కాస్త పోలీసాఫిసర్‌, క్యాబ్‌ డ్రైవర్ల మద్య పర్సనల్‌ రివెంజ్ గా కూడా రూపాతరం చెందుతుంది. అల్టిమేట్ గా ఈ సైకో అంతమయ్యాడా లేదా అనేది తెరమీద చూడాల్సిందే..

హాలీవుడ్‌లో ఇలాంటి సైకో ధ్రిల్లర్‌లు తరచుగా వస్తుంటాయి. కానీ తెలుగులో ఈ తరహా ప్రయోగం చేయటం రిస్క్‌తో కూడిన వ్యవహారం. మంచు విష్ణు-వర్మ ఈ విషయంలో అనుక్షణంతో పెద్ద సాహసమే చేశారు. ఈ సినిమాలో కధంటూ లేకున్నా.. సీరియస్‌గా నడిచే కధనం..నటీనటుల పెర్ఫార్మెన్స్‌ అనుక్షణం సినిమాను ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉండేలా చేశాయి. పోలిస్‌ ఆఫీసర్‌ గౌతమ్‌గా విష్ణు, సైకో సీతారంగా సూర్య, రిసెర్చర్‌ శైలజగా రేవతి, రిపోర్టర్‌గా మధుశాలినిలు తమ ఉత్తమ నటనతో మూవీని నడిపించేశారు. సైకోగా సూర్య చాలా రియలిస్టిక్‌ గా చేసిన నటన ఈ సినిమాకు మెయిన్‌ హైలెట్‌. మిగతా పాత్రలలో కోట, సుప్రీత్‌, శ్రావణ్‌ తమ పాత్రల పరిధి మేరకు పేర్పార్మ్‌ చేశారు. బ్రహ్మానందం పాత్ర ఈ సినిమాకు అనవసరం. నవదీప్, తేజస్విని, సన రెండుమూడు సీన్‌లలో కనిపిస్తారు. నిడివి కూడా తక్కువగానే ఉండటం అనుక్షణంకు ప్లస్‌ అయింది.

టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ బాగుంది. థ్రిల్లర్ సినిమాకు తగ్గట్టుగానే విజువల్స్ ఈ సినిమాలో పర్‌ఫెక్ట్‌ గా ఉన్నాయి. ఆడియెన్స్‌ ఈ మూవీకి కనెక్ట్ అయ్యేలా మ్యూజిక్ కంపోజ్‌ చేయటం జరిగింది. ఎడిటింగ్‌ కూడా ఓకె. బ్రహ్మానందం ఏపిసోడ్‌లను ఇంకాస్త తగ్గిస్తే బాగుండేది. తన గత చిత్రాలతో పోలిస్తే వర్మ అనుక్షణంను స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఒక్క పాయింట్‌ మీదనే కాన్‌సంట్రేషన్‌ చేసి ఆడియెన్స్‌ను మూవీలో ఇన్‌వాల్వ్‌ చేయగలిగాడు. ఓవరాల్‌గా ధ్రిల్లర్‌ సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్ ను అనుక్షణం కాస్త ఆకట్టుకుంటుంది. రెగ్యులర్‌ సినిమాలకు అలవాటుపడ్డ ప్రేక్షకులు ఈ సినిమా చూడకుంటేనే బేటర్‌.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 3/5                       – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

|Click here for Telugu Review|