రివ్యూ : అశ్వథ్థామ – వైలెంట్ క్రైమ్ థ్రిల్లర్ ..

స్టార్ కాస్ట్ : నాగశౌర్య, మెహరీన్‌, ప్రిన్స్‌ తదితరులు..
దర్శకత్వం : రమణ తేజ
నిర్మాతలు: ఐరా క్రియేషన్స్
మ్యూజిక్ : శ్రీ చరణ్
విడుదల తేది : జనవరి 31, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : అశ్వథ్థామ – వైలెంట్ క్రైమ్ థ్రిల్లర్ ..

నాగశౌర్య, మెహరీన్ జంటగా, రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో.. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘అశ్వథ్థామ’.. ఈ సినిమాకు నాగశౌర్య కథనందించడం విశేషం. చిత్ర టీజర్స్ , ట్రైలర్ , ప్రమోషన్ సినిమా ఫై అమాంతం అంచనాలు పెంచేయడం తో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు, అభిమానులతో పాటు ఓవర్సీస్ తెలుగు ఆడియన్స్ సైతం సినిమాను చూసేందుకు ఆసక్తి కనపరిచారు. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ..వారి ఆసక్తి కి తగ్గట్లు ఉందా…ఇప్పటివరకు ప్రేమ కథ చిత్రాలతో ఆకట్టుకునే శౌర్య మొదటి సారి ఏ రేంజ్ యాక్షన్ చూపించాడు..ఎలాంటి కథ రాసుకున్నాడు..అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

గణ ( నాగ శౌర్య) కు చెల్లెలు ప్రియ(సర్గున్ కౌర్) అంటే ఎంతో ఇష్టం. చెల్లెలుకు రవి (ప్రిన్స్) తో పెళ్లి కుదరడం తో అమెరికా నుండి గణ హైదరాబాద్ వస్తాడు. మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా ప్రియ ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆమె ఎందుకు ఆలా చేసుకుందా అని ఆరా తీయగా ఆమె గర్భవతి అని తెలుస్తుంది. కానీ ఆమెకు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు ఉండవు. కానీ ఆమె గర్భం దాలుస్తుంది. ఇందుకు గల కారణాలను తెలుసుకొని ప్రియకు బాసటగా నిలుస్తాడు.

తన చెల్లితో పాటు ఇంకెదరో యువతులు ఇలాంటి ఘటనలే ఎదుర్కోవడాన్ని గణ తన ఇన్వెస్టిగేషన్‌లో తెలుసుకుంటాడు. అసలు దీనికి కారణం ఎవరు..నగరంలోని యువతులను ఎందుకు ఇలా చేస్తున్నారు..నేహ (మెహరీన్‌)కు గణ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? డాక్టర్‌ మనోజ్‌కుమార్‌ (జిష్షు సేన్ గుప్తా) కు ఈ కథ కు ఎలాంటి సంబంధం ఉంది అనేది..? గణ..ఆ నేరగాన్ని ఎలా పట్టుకుంటాడు ..? అనేది సినిమా కథ.

ప్లస్ :

* ఫస్ట్ హాఫ్

* బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

* నాగ శౌర్య యాక్టింగ్

మైనస్ :

* సెకండ్ హాఫ్

* క్లయిమాక్స్

* సాంగ్స్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ఇప్పటివరకు ప్రేమకథలు తో ఆకట్టుకున్న నాగ శౌర్య..ఈ మూవీ లో మాస్ హీరోగా కనిపించాడు. యాక్షన్‌ సీన్స్‌లలో హై వోల్టేజ్‌ ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. తన శైలికి భిన్నంగా చేసిన ఈ సినిమాతో మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. అలాగే రచయిత గా తనలోని మరోకోణాన్ని పూర్తిస్థాయి లో బయటకు తీసి మెప్పించాడు.

* సైకో గా కనిపించిన జిసూసేన్ ఆకట్టుకున్నాడు. శౌర్య చెల్లి గా నటించిన సర్గున్ తన మేరకు నటించి మెప్పించింది. మెహరీన్‌ తన గ్లామర్ తో పాటు యాక్టింగ్ పరంగా కూడా మంచి మార్కులే వేసుకుంది.

* ప్రిన్స్ , పోసాని , సత్య మొదలగు వారు వారి వారి పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగం :

* శ్రీ చరణ్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది..జిబ్రాన్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమా కు హైలైట్ గా నిలిచింది.

* మనోజ్‌ రెడ్డి కెమెరా పనితనం తెరపై కనిపిస్తుంది. హీరోయిన్‌ అందాలు, యాక్షన్‌ సీన్లలో మనోజ్‌ తన సినిమాటోగ్రఫీతో ఆకట్టుకున్నాడు.

* నాగ శౌర్య రచయిత గా తన టాలెంట్ ఏంటో నిరూపించాడు. ఏ తల్లి కన్నదో వంద మంది కౌరవుల క్రూరత్వాన్ని ఈ ఒక్కడిలోనే కనింది’, ‘మనిషికి ఉండేది కోరిక, మృగాడికి ఉండేది వాంఛ. మరి మృగాడి వాంఛను తీర్చుకోవడానికి బతికుంటే ఏంటి? చచ్చిపోతే ఏంటి?’, ‘రావణాసురుడు చనిపోయింది సీతను ఎత్తుకపోయినందుకు కాదు.. జాటాయువును పూర్తిగా చంపనందుకు.. పూర్తిగా చంపుంటే సీతమ్మను ఎత్తుకపోయిందని రావణుడని, దక్షిణం వైపు వెళ్లారని రాముడికి తెలిసేదా? రావణుడు చనిపోయేవాడా?’ అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

* నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక డైరెక్టర్ విషయానికి వస్తే..శౌర్య కథ కు దర్శకుడు రమణ తేజ తన పనితనాన్ని చూపించి ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్ చాల బాగా ఆకట్టుకున్నప్పటికీ..సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు నిరాశ పరిచాయి. అలాగే క్లైమాక్స్ కూడా సాదాసీదాగా ఉండడం ప్రేక్షకులను నిరాశ పరిచింది, యాక్షన్‌ సీన్స్‌ బాగున్నప్పటికీ.. అన్నా చెల్లెలి మధ్య వచ్చే ఎమోషన్స్‌ సీన్స్‌ ఫై ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండు.

చివరగా : సస్పెన్స్ ను ఇష్టపడేవారికి ‘అశ్వథ్థామ’ బాగా నచ్చుతుంది.

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Click here for English Review