రివ్యూ : లౌక్యం

loukyam-review-1

టైమ్ పా స్లౌక్యం : రేటింగ్ : 3/5

శ్రీను వైట్ల అనే దర్శకుడు ఏడాదికి ఒక సినిమా చేస్తాడు.. ప్రతి సినిమా ఒకటే కధ..కోన వెంకట్ అండ్ బ్యాచ్ మాత్రం ఏడాదికి ఏడు సినిమాలు చేస్తారు. వాళ్లది కూడా అదే కధ. కాస్టింగ్ కొత్తగా ఉంటది తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు ’లౌక్యం’ సినిమాతో మరోసారి ఆడియెన్స్ ను టెస్ట్ చెసే ప్రయత్నం జరిగింది.

మేకా వెంకటేశ్వరరావు అలియాస్ వెంకీ వరంగల్ కుర్రాడు. ఆ టౌన్లో డాన్ అయిన బాబ్జీ (సంపత్ రాజ్) చెల్లెలును కిడ్నాప్ చేసి.. ఆమె ప్రేమించిన తన ఫ్రెండ్ కిచ్చి పెళ్లి చెస్తాడు. దీంతో బాబ్జి వెంకీ పై పగను పెంచుకుంటాడు. బాబ్జీ నుంచి తప్పించుకునేందుకు వెంకీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతాడు. అక్కడ తొలిచూపులోనే చంద్రకళను(రకుల్) చూసి, ఆమెకు దగ్గరవుతాడు. కానీ చంద్రకళకు కొందరి నుంచి ముప్పు ఉంటుంది. ఇంతకీ వారెవరు. బాబ్జీ నుంచి వెంకీ ఏలా బయటపడ్డాడు. తన ప్రేమను ఏలా సక్సెస్ చెసుకున్నాడనేది తెరమీద చూడాల్సిందే.

గోపిచంద్ కు ఈ రోల్ వేయటం కోత్తేమోకానీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని దాదాపు ప్రతి హీరో ఇంతకముందు ఈ తరహా ఇంటిలిజెంట్ గా తనకితాను భావించే పాత్రలను పోషించేశారు. వెంకీ గా గోపిలో అసలే మాత్రం కొత్తదనం అయితే కనిపించదు. రకుల్ చంద్రకళగా అందంగా కనిపించింది. ఆమె నటన పర్వాలేదు. బ్రహ్మానందం క్యాబ్ డ్రైవర్ సిప్పీ గా మళ్లీ హీరో, విలన్ల మద్య బకరా అయ్యాడు. పృద్వీ పాత్ర దూకుడు లో ఎం.ఎస్ నారాయణను గుర్తుకుతెచ్చెలా ఉంది.చంద్రమెహన్, ప్రగతి అక్కడక్కడ ఓవర్ యాక్టింగ్ చేయగా, సంపత్ రాజ్ అరుపులు హంసానందిని మెరుపులు ఎక్కువయ్యాయి.

దర్శకుడు శ్రీవాస్ తన పని తాను సక్రమంగా చేసుకున్నాడు. అయితే శ్రీదర్ సీపాన ఈ కదను ఏ విధంగా చెప్పాడో.. హీరోకి ఏలా నచ్చిందో అర్దంకాదు. ఎందుకంటే నాటి ఢీ మొదలుకోని నిన్నటి రభస వరకు చాలా సినిమాలలోని సన్నివేశాలు లౌక్యంలో ఉన్నాయి. రెఢీ సినిమాను మళ్లీ రెడీమెడ్ గా రాసి తీసారా అనేంతలా కోనవెంకట్ ఈ సినిమాకు తన వర్క్ చేసేశాడు. అక్కడక్కడ వినోదం ఉన్నా, అదీ రోటీనే. అనూప్ సంగీతం ఆకట్టుకునేలా లేదు. ఎడిటింగ్ లోపాలు బానే కనిపించాయి. నిర్మాత మాత్రం ప్రొడక్షన్ పరంగా ఎక్కడా రాజీ పడింది లేదు.

ఓవరాల్ గా ’లౌక్యం’ మంచి మార్కులనే సాధించిందని చెప్పవచ్చు. ఫ్యామిలీతో కలిసి లక్షణంగా లౌక్యం ను చూడొచ్చు. రొటీన్ స్టోరీ లైన్ అయినా.. కామెడీ సినిమాను సేఫ్ జోన్ లో నిలబెట్టింది.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 3/5                        – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

|Click here for English Review|